ఏకలవ్యలో గ్రామీణ యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం
తాండూరు మండలం జింగుర్తి లో గల ఏకలవ్య గ్రామీణ వికాస్ లో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ (EGVF) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జింగుర్తి గ్రామంలోని ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌లో 2026 అక్టోబర్ 25, ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది.గ్రామీణ యువతకు కెరీర్ మార్గదర్శకత్వం, నైపుణ్య శిక్షణ, వ్యవస్థాపకత, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ భాగయ్య జీ మార్గదర్శకత్వంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట చారి, హైదరాబాద్ కేవీఐసీ డైరెక్టర్ మనోజ్, ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ సీ.ఎస్.ఎస్. రావు, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మల్లారెడ్డి, ఎన్‌బీవీ ఫౌండేషన్‌కు చెందిన రాజాబ్ అలీ, సెంచూరియన్ యూనివర్సిటీకి చెందిన జె.ఎం. రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.అలాగే ఎన్ఐఆర్డీ, పంచాయతీరాజ్‌కు చెందిన డాక్టర్ రవీంద్ర గవాలి, డాక్టర్ రాజేష్ కుమార్ సిన్హా, ఈజీఎంఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీరజ, రంగారెడ్డి జిల్లా ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొననున్నారు. గ్రామీణ యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో స్థిరపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి యువత, నిరుద్యోగులు, విద్యార్థులు హాజరై ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై అవగాహన పొందాలని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పి. వెంకటేశ్వర్ రావు, కార్యదర్శి శ్రీ రామచంద్ర మూర్తి యువకులకు సూచించారు.
