జైరాంతండాలో ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
– భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్టాపన
– బంజారా వేషధారణలో ఆటపాటలతో సందడి
సంకల్పం ప్రతినిధి పెద్దేముల్: శ్రీ సంత్ సేవాలాల్ గోప్ప సంఘ సంస్కర్థ అని జైరాంతండా గ్రామ పెద్దలు అన్నారు. అదివారం పెద్దేముల్ మండల జైరాంతండాలో శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి కార్యక్రమంలో భాగంగా శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ నూతన విగ్రహన్ని గ్రామ పెద్దలు ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్రిబాయి జైరాం నాయక్, కారోబార్ హీరాసింగ్, గ్రామ నాయకుడు గ్రామ పెద్దలు తదితరులు, యువకులు పాల్గొన్నారు. అనంతరం మహరాజ్ జయంతి సందర్భంగా మహిళలు, యువకులు, పెద్దలు సాంప్రదాయ బంజార వేషాధారణలో ఆట పాటలతో తండాల్లో వాడ వాడన తిరుగుతు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బంజార ఆరాధ్య దైవంగా కొలిచే సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ప్రతి తండాల్లో నిర్వహించేల మండల నాయకులు చుడాలన్నారు. ప్రభుత్వం సేవాలా జయంతి వేడుకలను ప్రత్యేక నిధులు మంజురు చేయాలని పలువురు పెద్దలు కోరారు. మండల కేంద్రంలో కూడ బంజార భవన్ ఏర్పాటు చేయాలన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ యావత్తు బంజార సోదరులను ఏకతాటిపైకి తీసుకొచ్చిన గొప్ప మహనుభావుడన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దైవంగా కొలిచే సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ప్రతి తండాల్లో నిర్వహించేల మండల నాయకులు చుడాలన్నారు. ప్రభుత్వం సేవాలా జయంతి వేడుకలను ప్రత్యేక నిధులు మంజురు చేయాలని పలువురు పెద్దలు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గోన్నారు.
✍️ – సంకల్పం ప్రతినిధి పెద్దేముల్ మండలం 9640964209
