బషీరాబాద్‌లో ఘనంగా సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
సంకల్పం, బషీరాబాద్, ఫిబ్రవరి 15:
బషీరాబాద్ మండల కేంద్రంలో ఆదివారం సద్గురు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. బంజారా సంఘం మండల అధ్యక్షుడు రాము నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాము నాయక్ మాట్లాడుతూ.. అహింస, శాంతి, సామాజిక సంస్కరణల కోసం సేవలాల్ మహారాజ్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. బంజారాల ఆరాధ్య దైవమైన సేవలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
పాల్గొన్న ముఖ్య నేతలు:
ఈ వేడుకల్లో బంజారా సంఘం ఉపాధ్యక్షుడు బన్సీలాల్, మాజీ ఎంపీటీసీ నరేష్ చవాన్, ఆధ్యాత్మిక గురువులు వెంకటేష్ మహారాజ్, రాకేష్ మహారాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు అజయ్ ప్రసాద్, మాధవరెడ్డి, శంకర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, గ్రామ పెద్దలు, యువకులు భారీగా తరలివచ్చారు. సద్గురు చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ తండాల నుండి వచ్చిన యువకులు, మహిళలతో బషీరాబాద్ పురవీధులు కిక్కిరిసిపోయాయి.
✍️ – గోపాల్ సంకల్పం ప్రతినిధి బషీరాబాద్ మండలం
