September 18, 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, సిటీ కేబుల్ ఎండి గొట్టిగ నరసింహారెడ్డి

తాండూరు పట్టణంలోని భవాని ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, సిటీకేబుల్ ఎండి, ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొట్టిగ నరసింహారెడ్డి (బాబన్న) పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన వివాహ వేడుకల్లో నూతన వధూవరులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సిటీ కేబుల్ ఎండి గొట్టిగ నరసింహారెడ్డి,  సుస్మితా రెడ్డి  నూతన  వధూవరులను  ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, మాజీ డి పి సి సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు అల్లాపూర్ శ్రీకాంత్, పోలీస్ బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టిగ రాజశేఖర్ రెడ్డి, సంధ్యా రాజశేఖర్ రెడ్డి, వివి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పి ఆర్ టి యు నాయకులు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప, వెంకట్రాం రెడ్డి, కోట బాస్ పల్లి గ్రామస్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.