November 4, 2026

నేడు వికారాబాద్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నేడు అనగా  శనివారం 21 వ తేదీన  తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ రానున్నారు.   అనంతగిరి  హరిత రీసెట్లో నిర్వహించేతెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిసిసి అధ్యక్షుల శిక్షణ  తరగతులను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రానున్నారు.  దీంతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ముఖ్యమంత్రి  సెక్యూరిటీ విభాగం  అధికారులు ఎస్పీ చటర్జీ,  కృష్ణ ,   వికారాబాద్ డిఎస్పి తో కలిసి  ఎస్ ఏ పీ  మైదానంలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ ను పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, అదనపు కలెక్టర్ రాజేశ్వరి,ఆర్డిఓ వాసుచంద్ర, ఫారెస్ట్ అధికారి జ్ఞానేశ్వర్,  మున్సిపల్ కమిషనర్ విక్రం నరసింహారెడ్డి, ఆర్ఎంబి అధికారి శ్రీధర్,  వికారాబాద్ ఎమ్మార్వో లక్ష్మీనారాయణ, ఆర్టీవో వెంకటరెడ్డి, డిఎంహెచ్ఓ స్వర్ణ కుమారి, విద్యుత్  డీఇ రవిప్రసాద్,  జిల్లా ఎక్సైజ్ అధికారి విజయ భాస్కర్,  డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్  అరుణ సుధాకర్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.