September 19, 2026

కాంగ్రెస్ పార్టీలో చేరిన పర్వతాపూర్ మాజీ సర్పంచ్ లాల్ రెడ్డి

పర్వతాపూర్  మాజీ సర్పంచ్ లాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు.  శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి లాల్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్  లాల్ రెడ్డిమాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,  గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు,  తాండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేస్తున్న ప్రత్యేక కృషిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరేనని తెలిపారు.  ఈ కార్యక్రమంలో తాండూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగప్ప,   మాజీ తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,  చెంగోల్ మాజీ ఎంపిటిసి రాము తదితరులు పాల్గొన్నారు.