తాండూర్ బస్ స్టేషన్ లో విద్యుత్తు దీపాలు లేక అందాకారం … ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు
తాండూర్ బస్ స్టేషన్ లో విద్యుత్తు అంతరాయం వల్ల విద్యుత్ దీపాలు వెలగక అందాకారం నెలకొంది. శుక్రవారం ఉదయం 10 గంటలనుండి రాత్రి వరకు విద్యుత్ అందుబాటులో లేనందున ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ గ్రామాలకు వెళ్లే విద్యార్థులు, మహిళలు పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు విద్యుత్తు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆలూరు ప్రయాణికులు కోరుతున్నారు.
