కీ.శే. పట్నం రుక్కమ్మ గారికి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఘన నివాళులు
శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారి మాతృమూర్తి, కీ.శే. పట్నం రుక్కమ్మ గారి మృతికి BRS పార్టీ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రుక్కమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన పైలెట్ రోహిత్ రెడ్డి గారు, అనంతరం డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారిని పరామర్శించారు. రుక్కమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, మనోధైర్యంతో ముందుకు సాగాలని వారికి సూచించారు.అనంతరం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని, షాబాద్ మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి గారిని కూడా పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, విజయ్ కోట్ల, మహిపాల్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రుక్కమ్మ గారికి నివాళులర్పించారు.
