వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన BSR దంపతులు
తాండూర్లోని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం.తాండూర్లోని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) నివాసం శుక్రవారం భక్తి పరిమళాలతో, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. పవిత్ర వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సరళా రెడ్డి దంపతులు వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి, పుష్పాలు, పండ్లు, దీపాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రాల నడుమ సాగిన పూజా కార్యక్రమంతో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా BSR దంపతులు వరలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమానికి పలువురు కౌన్సిలర్లు, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తి.. ఆధ్యాత్మికత.. శుభాకాంక్షల నడుమ జరిగిన ఈ వరలక్ష్మి వ్రత వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.
