భక్తిశ్రద్ధలతో శ్రీ కాళికాదేవి అమ్మవారి బోనాల జాతర మహోత్సవం… అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూర్ పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ కాళికాదేవి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా బోనాల జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మధ్యాహ్నం మహా మంగళహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహా మంగళహారతి కార్యక్రమంలో ఆర్బీఓఎల్ సీఈవో బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి కరుణాకటాక్షాలు తాండూర్ నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.బోనాల జాతర సందర్భంగా మాజీ ఏఎస్పీ మధుసూదన్ రావు, బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి రమేష్, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకర్ యాదవ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్‌తో పాటు వివిధ సంఘాల నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మధ్యాహ్నం మహిళా భక్తులు భారీ సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.అనంతరం ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే అమ్మవారిపై భక్తితో విష్ణువర్ధన్ రెడ్డి పాటలు పాడించిన పాటను బుయ్యని శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు.సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన రంగం ఎక్కే కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమం దేవాలయ కార్యనిర్వహణ అధికారి నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు ఎస్పీ రవికాంత్, పట్టణ అధ్యక్షులు అంతరం కిరణ్, ప్రధాన కార్యదర్శి బండి శ్రీధర్, బంటు వేణుగోపాల్, అల్లాపూర్ శ్రీకాంత్, బాతుల నాగు, రాము ముదిరాజ్, వెంకటేష్, రమేష్ టైలర్,దేవాలయ మాచి చైర్మన్ రాములు, పోట్లీ మహారాజ్ దేవాలయం చైర్మన్ ప్రసాద్ గౌడ్, అమ్రేష్‌తో పాటు ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
