10వ తరగతి అర్హతతో HYDRA DRFలో 150 కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు HYDRA (Hyderabad Disaster Response & Assets Monitoring and Protection Agency) శుభవార్త తెలిపింది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF)లో మొత్తం 150 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నియామకాల్లో 100 DRF అసిస్టెంట్ పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులై, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఫిజికల్ ఈవెంట్స్, శారీరక సామర్థ్యం మరియు అర్హతల ఆధారంగా జరుగుతుంది.ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.అభ్యర్థులు అసలు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వెంట తీసుకురావాలని సూచించారు. హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకు తప్పనిసరిగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
