తెలంగాణ రక్షణ సేనలో తాండూరుకు కీలక పదవులు.. ఇన్ఛార్జిగా రాఘవేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా వీరమణి!
తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాఘవేందర్ రెడ్డి నియామకం
తెలంగాణ రక్షణ సేనలో తాండూరు నియోజకవర్గానికి కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2026 అక్టోబర్ 20న విడుదల చేసిన నియామకాల జాబితాలో తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాఘవేందర్ రెడ్డిని నియమించారు.అదేవిధంగా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా అరోర్ వీరమణిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.తెలంగాణ రక్షణ సేన సంస్థాగత బలోపేతంలో భాగంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జులను, ఇతర బాధ్యులను నియమించారు. ఈ జాబితాలో నాగార్జునసాగర్, కొడంగల్, బాన్సువాడ, పరకాల, తాండూరు, సిద్దిపేట, చెన్నూరు, మలక్పేట్, పినపాక నియోజకవర్గాలకు బాధ్యతలు కేటాయించారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అనితా చౌదరిని నియమించారు.తాండూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడం, సంస్థాగతంగా బలోపేతం చేయడంలో నూతనంగా నియమితులైన బాధ్యులు ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
