తాండూర్ బిగ్ బాష్ లీగ్‌లో బీఎస్ఆర్ జట్టు జయకేతనం…! విజేతలకు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అభినందనలు..!
విజేతలకు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అభినందనలు..
తాండూర్: తాండూర్ పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న తాండూర్ బిగ్ బాష్ లీగ్ (TBBL–2026) క్రికెట్ టోర్నమెంట్లో బీఎస్ఆర్ (BSR) జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆ జట్టు సభ్యులకు ఆర్బీఓఎల్ సీఈఓ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఘనంగా అభినందనలు తెలిపారు. జట్టు విజయం తాండూర్ ప్రాంతానికి గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.తాండూర్ ప్రాంతంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా స్థానిక యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి, వారిలో స్నేహభావాన్ని పెంపొందించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించి తాండూర్‌కు మంచి పేరు తీసుకురావాలని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు.
