May 15, 2026

ప్రచారంలో దూసుకుపోతున్న 11 వార్డ్ బిజెపి అభ్యర్థి ఇందూరు రాములు

IMG-20260204-WA1229(1)

……ప్రచారంలో దూసుకుపోతున్న 11 వార్డ్ బిజెపి అభ్యర్థి ఇందూరు రాములు
తాండూరు పట్టణంలోని 11 వ వార్డు బిజెపి అభ్యర్థి ఇందూరు రాములు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 11వ వార్డులోని ఆదర్శనగర్, కట్ట మైసమ్మ, వరసిద్ధి వినాయక ప్రాంతాలలో ఇందూరు రాములు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇందూరు రాములు మాట్లాడుతూ 11వ వార్డులో పలు సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ,సీసీ రోడ్డు, విద్యుత్ స్తంభాలు, త్రాగునీరు తదితర సమస్యలు ఉన్నాయని అలాంటి సమస్యలను తీర్చాలంటే కేవలం బిజెపి నుండే సాధ్యమని అన్నారు. ప్రచారంలో తనకు కాలనీ నివాసుల నుండి పూర్తి మద్దతు లభిస్తుందని తాను అత్యధిక మెజారిటీతో విజయం సాధించనున్నట్లు ఇందూరు రాములు తెలిపారు.