November 4, 2026

ఎన్నికలను సజావుగా నిర్వహించాలి…. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి లోపాలు లేకుండా ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా మెరీనాట్ పాఠశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పై అధికారులకు తెలుపాలని కోరారు. ఎన్నికల సామాగ్రిని బ్యాలెట్ పేపర్లను పోలింగ్ బాక్స్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరుచేసి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. బ్యాలెట్ పత్రాలు బాక్సులు జాగ్రత్తగా ఉండేలా చూడాలని ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేక ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం కల్పించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని త్రాగునీరు లైటింగ్ పార్కింగ్ ప్రదేశాలు వచ్చిపోయేదారులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. రూట్ ల వారీగా బస్సులు బయలుదేరే విధంగా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుదీర్, మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి, తహసిల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.