September 19, 2026

తాండూరుపై ప్రత్యేక విజన్ ఉంది …..ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు పై ప్రత్యేక విజన్ ఉందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.  మునిసిపల్ చివరి రోజు ప్రచారం అనంతరం  సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 36 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి  తమదైన శైలిలో ప్రచారం నిర్వహించారని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు పూర్తిస్థాయిలో ఆదరించారని ఎక్కడికక్కడే ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్  ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు  వెళ్లడంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్ అభ్యర్థులు పూర్తిస్థాయిలో పనిచేయడం జరిగిందన్నారు.  ప్రజా ఆశీర్వాదంతో 36 వార్డులలో 36 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నామని మున్సిపల్ చైర్మన్ పీఠం  కాంగ్రెస్ పార్టీ సొంతం కానందాన్ని అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ముఖ్యమైన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ తోడుగా ఉంటే మరింత అభివృద్ధి చేయడానికి వీలవుతుందని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.  గతంలో ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో అందరికీ తెలుసు అని ఆ విషయాలను ప్రస్తావించడం అనవసరమన్నారు.  తాండూరు పట్టణాన్ని అభివృద్ధి పరచాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్,  మాజీ  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, అమీర్ అబ్దుల్లా, హబీబ్ లాలా,రవీందర్ గౌడ్ వడ్డే శ్రీనివాస్,మసూద్ తదితరులు పాల్గొన్నారు