September 19, 2026

ఫస్ట్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్ షిప్ లో తాండూరు మాస్టర్ జపాన్ చోటే ఖాన్ క్రీడాకారుల సత్తా

ఫస్ట్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్ షిప్ లో  తాండూరు మాస్టర్  జపాన్ చోటే ఖాన్ క్రీడాకారుల సత్తా

……11 గోల్డ్,  ఒక సిల్వర్ పథకాలను  సాధించిన  కరాటే క్రీడాకారులు

…… ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించిన సాయి మాస్టర్

తాండూరు పట్టణానికి చెందిన మాస్టర్ జపాన్ చోటే ఖాన్  క్రీడాకారులు మరోసారి తమ ప్రతిభను కనబరిచారు.  ఆదివారం వికారాబాద్ లో జరిగిన ఫస్ట్ ఇంటర్ ఛాంపియన్  షిప్ 2026  లో 11 గోల్డ్ మెడల్, ఒక్క  సిల్వర్ మెడల్ సాధించి తమ సత్తా చాటారు.  ఈ సందర్భంగా తాండూరు లోని సీనియర్ మాస్టర్ జపాన్ చోటే 7 డౌన్ బ్లాక్ బెల్ట్ శిక్షకులు బివి సాయికుమార్ ,  బివి మోహన్ కృష్ణ 5 డౌన్  బ్లాక్ బెల్ట్  శిక్షకుల  దగ్గర శిక్షణ పొందిన 12 గురు  కరాటే  క్రీడాకారులను వికారాబాద్  లో జరిగిన పోటీలలో పాల్గొన్నారు. ఫస్ట్ ఇంటర్ ఛాంపియన్  షిప్ 2026 పాల్గొన్న   అలియా బేగం,  అల్టియాజ్, వైష్ణవి, వినయ్ కుమార్, ప్రణయ్ కుమార్, అబ్దుల్ ఆనిఫ్,  జగదీష్, లక్ష్మి, స్మిత్ పాల్గొని తమ సత్తా చాటారు.  అందులో 11గురు బంగారు పతకాలను సాధించి తాండూరుకు మంచి పేరు తెచ్చారు.  ఈ సందర్భంగా మాస్టర్ జపాన్ చోటే ఖాన్  సీనియర్ మాస్టర్  బి వి సాయికుమార్ మాట్లాడుతూ  తమ దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు ఏకంగా 11 గోల్డ్ పథకాలను  సాధించి  అద్భుత ప్రతిభ కనబరచడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.  కరాటే లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన   క్రీడా కారులను  అభినందిస్తూ బెల్టులను, ప్రశంసాపత్రాలను అందజేశామని సాయికుమార్ తెలిపారు. కరాటే  నేర్చుకోవాలని  ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని సీనియర్ మాస్టర్ సాయికుమార్ తెలిపారు.  తాండూరు పట్టణంలోని విశ్వవేధ పాఠశాల మైదానంలో ప్రతిరోజు శిక్షణ ఉంటుందని ఈ అవకాశాన్ని తాండూరు పట్టణ యువతీ యువకులు, విద్యార్థులు ఉపయోగించుకోవాలని సాయికుమార్ కోరారు.