July 30, 2026
Oplus_0

Oplus_0

– ఖాతాదారులు కేవైసీ (KYC) పూర్తి చేసుకోవాలని బ్యాంక్ అధికారుల సూచన

పెద్దేముల్, ఫిబ్రవరి 9: మండల పరిధిలోని పెద్దేముల్ మరియు గాజీపూర్ గ్రామాల్లో మంగళవారం (ఫిబ్రవరి 10న) ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా టీజీబి, బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఆధ్వర్యంలో ప్రత్యేక బ్యాంకింగ్ సదస్సులు నిర్వహించనున్నాట్లూ పెద్దేముల్ మండల ఎంపీడీఓ రతన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలకు కేవైసీ (KYC) అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా సంబంధిత బ్యాంకుల ఆధ్వర్యంలో ఈ గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సదస్సుల వివరాలు:

రేపు ఉదయం 10:00 గంటలకు పెద్దెముల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) ఆధ్వర్యంలో, అలాగే ఉదయం 11:00 గంటలకు గాజీపూర్ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సులు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా పెద్దేముల్ మండల ఎంపీడీఓ రతన్ సింగ్ మరియు బ్యాంక్ అధికారులు,  మాట్లాడుతూ.. ఖాతాదారులు తమ బ్యాంకింగ్ లావాదేవీలు నిరంతరాయంగా కొనసాగాలంటే కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ సభల్లో వీఓలు (VOs), మహిళా సంఘాల (SHG) సభ్యులు, పెన్షనర్లు, ఉపాధి హామీ కూలీలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఖాతాలకు సంబంధించిన కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ఆధార్ కార్డు, ఫోటోలు వంటి అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.