సాయిపూర్ అంగన్వాడి కేంద్రంలో ఎస్బిఐ పాన్ ఇండియా సిఎస్ఆర్ ఆధ్వర్యంలో చిన్నారులకు స్కూల్ మెటీరియల్ కిట్ పంపిణీ
సాయిపూర్ అంగన్వాడి కేంద్రంలో ఎస్బిఐ పాన్ ఇండియా సిఎస్ఆర్ ఆధ్వర్యంలో చిన్నారులకు స్కూల్ కిట్ మెటీరియల్ పంపిణీ చేశారు. మంగళవారం తాండూర్ పట్టణంలోని సాయిపూర్ అంగన్వాడి కేంద్రం రెండులో తాండూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఏజిబి) మేనేజర్ సాగర్ రెడ్డి విద్యార్థులకు స్కూల్ కిట్ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాగర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో చదువుతున్న విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని అందుకో తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ సుశీల మాట్లాడుతూ ఎస్బిఐ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ విద్యార్థులకు ఎల్ఈడి టీవీ, ఎలక్ట్రిక్ కుక్కర్, వర్క్ బుక్స్, పెన్నులు పెన్సిల్స్ బాక్స్ పలకలు, గోడ గడియారం తదితర ఆట వస్తువులు ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్ర హాలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, అంగన్వాడీ టీచర్ నవీన, అంగన్వాడి ఆయా ఇర్ఫాన్ బేగం, ప్రీ స్కూల్ పిల్లలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
