మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం
బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తాండూరు పట్టణంలోని 36 వార్డులలో మొత్తం 77029 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 37,499 మహిళలు 39525 మంది ఉండగా ఇతరులు ఐదుగురు ఉన్నారు. తాండూరు పట్టణంలోని 36 వార్డులలో జరిగే ఎన్నికలకు 34 స్థలాలలో 117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 117 ప్రొజెటింగ్ అధికారులు, 117 అసిస్టెంట్ ప్రోసిడింగ్ అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రంలో మరో ముగ్గురు ఇతర అధికారులు మొత్తం 351 మంది అధికారులు విధులు నిర్వహించనున్నారు. తాండూరు పట్టణంలో 19 అతి సమస్యత్మకమైన ప్రాంతాలు, 31 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైన కేంద్రాలని అధికారులు గుర్తించారు. తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాలను డిస్ట్రిబ్యూషన్ మరియు కౌంటింగ్ కేంద్రంగా నిర్ణయించారు. మొత్తం 9 రూట్లలో జోనల్ అధికారులు, 12 కౌంటర్లు 117 బ్యాలెట్ బాక్సులు అదనంగా ప్రతి కేంద్రంలో ఒక్క బ్యాలెట్ బాక్స్ ను ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అనగా 117 వెబ్ కాస్టింగ్ విధులు నిర్వహించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో ఎన్నికలను నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు జరిగాయి. బుధవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్లు ఓటర్ స్లిప్పు తో పాటు 16 రకాల గుర్తింపు కార్డులను తమ వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.
ఇక రాష్ట్రస్థాయిలో మున్సిపల్ ఎన్నికల వివరాలు ……
ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వసిద్ధం చేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2582 మునిసిపాలిటీలలో 12 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా కాగా మిగిలిన 2569 మున్సిపాలిటీలలోని వార్డులో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర మొత్తంలో 10719 కౌన్సిలర్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందుకోసం 6017 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్ లకు కూడా బుధవారం 11వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7 కార్పొరేషన్లలో 412 వార్డులలో పోలింగ్ జరగనుంది. అందుకు అధికారులు 2174 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లలో పోటీ చేయనున్న 2225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బుధవారం 52,17,413 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో 25,49,750 మంది పురుషులు, 26,67 వేల 25 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. 638 మంది ఇతర ఓటర్లు ఉండగా 1379 ఆర్వోలు, 41773 పోలింగ్ సిబ్బంది, 8191 వెబ్ కాస్టింగ్, 16,382 బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నారు. రాష్ట్ర మొత్తం మీద 4150 మంది బైండోవర్ కాగా, 1183 ఆయుధాలు డిపాజిట్ చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించనున్నారు.
