11 వార్డులో శనిగల కలకలం…. ఓ అభ్యర్థి విజయం సాధించాలని చల్లిన శనిగలు ….!
తాండూరు పట్టణంలోని వార్డ్ నెంబర్ 11 లో ఎటు చూసినా శనిగలను చల్లారు. బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓటర్లు తమకి ఓటు వేయాలని ఓ అభ్యర్థి ఓ గురువు దగ్గర మంతరించుకొని వచ్చి తమకే ఓట్లు వెయ్యాలని, తమ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవాలని, ఓటర్లను బరిలో ఉన్న అభ్యర్థి ఆకర్షించాలని శనిగలను చలినట్లు వినికిడి. 11వ వార్డులో ముగ్గురు వ్యక్తులు ఎన్నికల బరిలో ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆల్వాల్ రాజేష్ చారి, బిజెపి అభ్యర్థిగా ఇందూరు రాములు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బంటు వేణుగోపాల్ బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రం మరియు 11వ వార్డులోని ఆదర్శనగర్, పాత కుంట, కట్ట మైసమ్మ, వినాయక దేవాలయం తదితర ప్రాంతాలలో ఒక క్వింటాల్ కు పైగా శనిగలను చల్లారు. కాగా చలిన వ్యక్తి ఎవరో ఏ అభ్యర్థి కోసం చల్లారో మిస్టరీగా మారింది. మరి ఆ అభ్యర్థి విజయం సాధిస్తాడో లేదో 13వ తేదీ వచ్చే ఫలితాలలో తేటతెల్లెం కానున్నది.
