November 5, 2026
సంకల్పం / బషీరాబాద్, ఫిబ్రవరి 15:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో వెలసిన శ్రీ మహాదేవ లింగేశ్వర దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బషీరాబాద్ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్, ప్రముఖులు రాకేష్ మహారాజ్, పవన్ ఠాకూర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘనస్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సర్పంచ్‌ను, ఇతర ప్రముఖులను ఆలయ కమిటీ వారు శాలువాతో గౌరవప్రదంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– గోపాల్ సంకల్పం ప్రతినిధి బషీరాబాద్ మండల