November 4, 2026

రైళ్లలో నెల రోజులపాటు కొనసాగిన అగ్నిమాపక భద్రతా పై అవగాహన

రైళ్లలో నెలరోజుల పాటు కొనసాగిన అగ్నిమాపక భద్రతపై అవగాహన కార్యక్రమం నేటితో మిగిసింది. గత నెల 10వ తేదీన ప్రారంభమైన అగ్నిమాపక భద్రతపై అవగాహన కార్యక్రమం ఈనెల 19న ముగిసింది. DSC అనిల్ కుమార్, ASC  నవీన్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆర్పిఎఫ్ అధికారులు తెలిపారు.  వికారాబాద్ రైల్వే స్టేషన్  పరిధిలో వికారాబాద్ ఇన్స్పెక్టర్ కే సత్యనారాయణ ఆధ్వర్యంలో పాటు అగ్నిమాపక భద్రత అవగాహన కార్యక్రమం జరిగింది.  రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో  అగ్ని ప్రమాద నివారణపై ఆర్పిఎఫ్  అధికారులు అవగాహన కల్పించారు.  రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే గ్యాస్ సిలిండర్లు,  కిరోసిన్ స్టవ్‌లు, పేలుడు పదార్థాలు, అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే ఏదైనా ప్రమాదకరమైన మండే స్వభావం ఉన్న పదార్థాలను తమ వెంట తీసుకు వెళ్ళరాదని సూచించారు.  రైళ్లలో ప్రయాణించేటప్పుడు సిగరెట్లు లేదా బీడీలు కాల్చడం వల్ల  అగ్ని ప్రమాదం జరిగే  అవకాశం ఉంటుందని వాటి వల్ల దూరంగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు. ప్రయాణ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏదైనా అనుమానాస్పద వస్తువు కనబడితే వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ లేదా రైల్వే అధికారులకు  తెలుపాలని  ప్రయాణికులకు సూచించారు.  రైలలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగిన అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక యంత్రాలను ఎలా ఉపయోగించాలో ప్రయాణికులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్క ప్రయాణికుడు అత్యవసర సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని రైల్వే అధికారులు సూచించారు.