May 15, 2026

తాండూర్ పట్టణం వార్డ్ నెంబర్ 7 కౌన్సిలర్ ఈర్షద్ పై దాడి…. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు

తాండూరు పట్టణంలోని వార్డ్ నెంబర్ 7 కౌన్సిలర్ ఇర్షాద్ పై దాడి జరిగింది.  తాండూరు పట్టణంలోని ఇర్షాద్ తన నివాసంలో ఉండగా  తన బంధువులే దాడి చేశారని  అజార్,  ఆయాజ్ అనే వ్యక్తులు దాడి చేశారని  తెలిపారు.  ఆయన పై దాడి జరిగిన  అనంతరం  తాండూరు పట్టణంలోని జిల్లా  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  అక్కడ ప్రథమ చికిత్స జరిగిన అనంతరం వైద్యుల సలహా వైరకు మెరుగైన చికిత్స కోసం  హైదరాబాద్ తరలించారు.  పోలీసులు  ఇర్షాద్ పై జరిగిన దాడి విషయంలో  ఆయనను వివరణ కోరగా   తనపై  తన  బామ్మర్దులు దాడి  చేశారని తెలిపారు.