తాండూరు పట్టణంలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేస్తూ స్థానికులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గుండు దేవుడు ….!
తాండూరు పట్టణంలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి చేతబడి చేస్తూ స్థానికులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తాండూరు పట్టణంలోని విలియమూన్ మైదానంలో ఉన్న ఒక పొదలో గుండు దేవుడు అనే ఓ యువకుడు క్షుద్ర పూజలు చేస్తూ పట్టు బడ్డాడు. ఒక బాలికకు చాలా రోజులుగా పెళ్లి కావడం లేదని గుండు దేవుడిని కలవడంతో అర్ధరాత్రి విలియమూన్ గ్రౌండ్ లోని ఓ ముళ్ళపదలో కూర్చోబెట్టి పసుపు కుంకుమ,గుమ్మడికాయ, మిరపకాయలు, నిమ్మకాయలు తదితర వస్తువులతో పూజలు నిర్వహించారు. అదే సమయంలో అటువంటి వెళ్తున్న స్థానికులు గమనించి గుండు దేవుడిని పట్టుకొని విషయాన్ని తెలుసుకున్నారు. ఆ బాలికను అక్కడి నుండి పంపించి, గుండు దేవుడికి స్థానికులు తగిన శాస్త్రి చేశారు. గుండు దేవుడిని చూసి స్థానికులు భయపడేవారు, ఇకనుండి క్షుద్ర పూజలు మాన్పించాలని పలువురు స్థానికులు వేడుకుంటున్నారు
