హద్దు దాటొద్దు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్: రోహిత్ రెడ్డికి తాండూర్ మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి!”
Oplus_131074
– అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు.
– నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి తప్పదు.
– మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నీరజా బాల్ రెడ్డి హెచ్చరిక.
తాండూర్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఇచ్చిన తీర్పును భరిస్తలేకనే కాంగ్రెస్ పార్టీ పై బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తాండూర్ మున్సిపల్ చైర్మన్ నీరజా బాల్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మృదువు స్వభావి కావడం, తాండూర్ అభివృద్దే లక్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారు కాబట్టే మున్సిపల్ ఎన్నికలలో తాండూర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 18 శాతనికి పడిపోవడానికి గల కారణం బిఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం అని అన్నారు, ఇక తాండూర్ లో బీజేపీ పార్టీ గల్లంతయ్యింది. తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సామరస్యంగా ప్రజలలో మమేకం అయ్యారు కాబట్టే ప్రజల ఆశీర్వాదం ఉందని అన్నారు. గతంలో మున్సిపల్ లో కౌన్సిలర్ గా మూడవ సారి గెలవడంతో మాకు అనుభవం ఉండటం వల్ల మాకు ఈ చైర్మన్ అవకాశం లభించిందని అన్నారు. గతంలో మీరు ఎమ్మెల్యే ఉన్నపుడు మీ ఆధ్యర్యంలో కౌన్సెల్ లో గొడవలే తప్ప అభివృద్ధి ఎం కాలేదని అన్నారు. మనోహర్ రెడ్డి లోకల్, మనోహర్ రెడ్డి పిల్లలు తాండూర్ గడ్డపైన ఉన్న నలంద స్కూల్ లో చదువుకున్నారు. మరి రాజకీయం అవకాశం కోసం తాండూర్ లోకల్ అని చెప్పుకుంటున్న రోహిత్ రెడ్డి మీ పిల్లలు ఎక్కడ చుడుతున్నారు అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గెలుపొంది సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తాండూర్ లో అన్ని రోడ్లు అద్దంలా మారుతున్నాయనీ అన్నారు.
శాంతి భద్రతలను కాపాడే పోలీస్ అధికారిపై చేయి చేసుకొని శాంతి భద్రతలను భంగం చేయడంతో కేవలం రోహిత్ రెడ్డి కి బిఆర్ఎస్ నాయకులకే దక్కుతుందని ఎద్దేవ చేశారు. అధికారులపై దాడులు చేసే స్వభావం కాంగ్రెస్ పార్టీలో లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మక ద్రోహం చేశారు. రంగులు మార్చే తత్వం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ది అన్నారు.. తాండూర్ లో శాంతి భద్రతలు, విద్యా, వాద్యరంగం, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టామనీ చైర్మన్ అన్నారు. ఎమ్మెల్యే పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అని తాండూర్ మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు అబ్దుల్ రావుఫ్, మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, జుబేర్ లాలా, సర్దార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
