September 18, 2026

మార్చి 14 నుండి 10వ తరగతి పరీక్షలు…

tg-ssc-hall-ticket-2026

మార్చి 14 నుండి 10వ తరగతి పరీక్షలు…

…. హాల్ టికెట్లు  పొందేందుకు వాట్సాప్ ద్వారా కొత్త సదుపాయం

…. వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు

తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల  మార్చి 14  నుండి ప్రారంభం కానున్నాయి.  ప్రతిరోజు ఉదయం 9.30 ని. నుండి 12.45  వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.  10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ల డౌన్లోడ్ కోసం  తెలంగాణ  ప్రభుత్వం నూతనంగా  సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.  8096958096 అనే నంబర్ కు మెసేజ్ పంపడం ద్వారా హాల్ టికెట్ పొందవచ్చు.  లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in  నుండి కూడా విద్యార్థులు తమ హాల్ టికెట్లను పొందవచ్చు.  హాల్ టికెట్ల డౌన్లోడ్ లో ఏవైనా  సాంకేతిక సమస్యలు, ఇబ్బందులు ఏర్పడితే  విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు 040-23230942  నంబర్కు సంప్రదించి సహాయం పొందవచ్చు అని అధికారులు సూచించారు.