జిల్లాలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు… జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
మార్చి 8 ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా జిల్లా లోని మహిళలందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలుతెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ మహిళలకు గౌరవం మరియు సమాన హక్కులు, అవకాశాలు లభిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం నేటి తరం మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు మరియు రాజకీయ రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ సమాజ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎస్పీస్నేహ మెహ్రా అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. దేశ నిర్మాణంలో మరింత మంది మహిళలు ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు సంకల్పంతో ముందుకు రావాలని ఎస్పీ స్నేహ మెహ్రా ఆకాంక్షించారు.మహిళల భద్రత మరియు రక్షణ విషయంలో పోలీస్ శాఖ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సాధించిందని, అవసరమైనప్పుడు మహిళలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, వారి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ మంచి సంకల్పంతో ఉందని ఎస్పీ స్నేహ మెహ్రా భరోసా ఇచ్చారు.మహిళల భద్రత కోసం ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని. ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు మరియు గ్రామాల్లో షీ టీమ్, కళ జాత బృందం ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళలు తమ హక్కులు, చట్టాలు మరియు భద్రతకు సంబంధించిన సేవలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు.ప్రతి మహిళా తన హక్కులపై అవగాహన పెంపొందించుకుని ధైర్యంగా ముందుకు సాగుతూ తన లక్ష్యాలను సాధించాలని ఎస్పీ స్నేహ మెహ్రా పిలుపునిచ్చారు
