రోడ్లను ఆక్రమించి కూరగాయలు విక్రయించవద్దు…. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి
రోడ్లను ఆక్రమించి కూరగాయలను విక్రయించవద్దని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి సూచించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు కూరగాయల వ్యాపారులు రోడ్డును ఆక్రమించి కూరగాయలు విక్రయించరాదని కూరగాయల వ్యాపారస్తులకు సూచించారు. రోడ్డుపై కూరగాయల విక్రయాలు జరిపితే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నదని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి అంబులెన్స్లు వెళ్లడానికి కూడా ఇబ్బందిగా మారిందని చైర్మన్ అన్నారు. రేపటినుండి రోడ్డును ఆక్రమించి కూరగాయల వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ జవాన్ రమేష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
