ప్రభుత్వ ఐటిఐ/ఏటిసి సెంటర్లలో షార్ట్ టర్మ్ టెక్నికల్ కోర్సులకు ఆహ్వానం
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీ లతోపాటు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లో షార్ట్ టర్మ్ టెక్నికల్ కోర్సులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా షార్ట్ టర్న్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్ సురేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. షార్ట్ టర్న్ కోర్సులు ముఖ్యంగా లేట్ మిషన్, ఆపరేషన్ అండ్ ప్రోగ్రామింగ్, సిఎస్సి మిల్లింగ్ మిషన్ ఆపరేషన్ అండ్ ప్రోగ్రామింగ్, ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ పై అవగాహన కోర్సు, జూనియర్ రోబోట్ ఆపరేటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రికల్ వెహికల్ పై బేసిక్ కోర్స్, క్యాడ్ 2డి మరియు 3d ఫీచర్స్ ఉపయోగించి జూనియర్ ప్రోడక్ట్ డిజైనర్ తదితర కోర్సులను నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ స్వల్పకాలిక శిక్షణ ద్వారా నిరుద్యోగ యువకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై నైపుణ్యాన్ని పెంపొందింప చేసి ఉపాధ్యాయ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ కోర్సులకు 10వ తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీలు అయిన వారు అర్హులని తెలిపారు. ఇతర వివరాల కోసం 9177472488, 9550112364 నెంబర్లలో సంప్రదించాలని, ప్రభుత్వ ఏటిసి కేంద్రాలు మరియు ఐటిఐ వికారాబాద్ కార్యాలయంలో సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్ సురేంద్రబాబు తెలిపారు.
