July 31, 2026

ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీకి విశేష స్పందన…తాండూర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్

imresizer-ChatGPT Image Jul 31, 2026, 08_37_03 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన టూర్ ప్యాకేజీకి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని తాండూర్ డిపో మేనేజర్ పరిటాల ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 3వ తేదీన తాండూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సు కాణిపాకం, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ ప్రాంతాలకు బయలుదేరుతుందని తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ యాత్రకు ఇప్పటికే అన్ని సీట్లు రిజర్వ్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీకి ఒక్కో ప్రయాణికుడికి రూ.3,600 టికెట్ ధరగా నిర్ణయించినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికుల నుంచి లభించిన స్పందనను దృష్టిలో ఉంచుకుని త్వరలో ఇదే ప్యాకేజీలో మరో ప్రత్యేక బస్సును కూడా సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు.అంతేకాకుండా ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక టూర్ ప్యాకేజీలను రూపొందించి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. టూర్ ప్యాకేజీలకు ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి మరిన్ని యాత్రలను రూపొందిస్తామని డిపో మేనేజర్ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 9959226251 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు.