ఉద్యోగ జీవితంలో పదవి విరమణ సహజం….. మల్లినాథప్ప పదవి విరమణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి
ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజమైన ప్రక్రియ అని తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూర్ పట్టణంలోని సల్ల గార్డెన్స్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు మల్లినాథప్ప పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత 35 సంవత్సరాలుగా తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సేవలందించిన మల్లినాథప్పకు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వొకేషనల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేసిన మల్లినాథప్ప తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో విద్యార్థుల పట్ల అంకితభావంతో, నిబద్ధతతో పనిచేశారని. మల్లినాథప్ప అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, అభిమానులు, బంధువులు ఘనంగా సన్మానించారు.పదవీ విరమణ అనంతరం మల్లినాథప్ప శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ శంకర్, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నరసింహులు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యాభిమానులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
