August 1, 2026

జక్కేపల్లి గ్రామంలో యువకుడిపై దాయాదుల దాడి.. తీవ్రగాయాల పాలైన యువకుని జిల్లా ఆసుపత్రికి తరలింపు

ChatGPT Image Aug 1, 2026, 10_54_04 AM

యాలాల మండలం జక్కేపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఓ యువకుడిపై దాయాదులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం, “కాస్త పని ఉంది రమ్మని” పిలిచి  నిర్మానుష  ప్రాంతానికి తీసుకెళ్లి తనపై దాడి చేశారని  లక్ష్మణ్ ఆరోపించారు. మొదట తలపై బలంగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయానని, అనంతరం వీపు, కాళ్లపై విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు. ఈ దాడికి తన బాబాయి కొడుకులు గిరి, బీములు కారణమని లక్ష్మణ్ ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ ఘటనపై లక్ష్మణ్ తండ్రి అంబరప్ప, అన్న మల్కప్ప మాట్లాడుతూ, తమ కుటుంబానికి చెందిన లాలప్ప కుమారులు గిరి, బీములు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ యాలల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు.