త్రాగునీటి సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్ నెం…08416-235291
జిల్లాలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08416-235291 కు కాల్ చేసి సమస్యలను వివరించవచ్చని కలెక్టర్ తెలిపారు. నీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకొని ఉన్నామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే త్రాగునీటి సరఫరా లో సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కంట్రోల్ రూమ్ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 వరకు అందుబాటులో ఉంటుందని ముఖ్యంగా త్రాగునీటి కొరత, పైప్ లైన్ లీకేజీలు, ట్యాంకర్ల సరఫరా లోపాలు తదితర సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని, వెంటనే అధికారులు పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
