పారదర్శకంగా వరి కొనుగోలు కేంద్రాలు… జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
యాసంగి 2025-26లో వరి ధాన్యం కొనుగోలు సరఫరాలో అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో పౌర సరఫరా ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి వారి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోడు చేపట్టాలని ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలుకు 2389 రూపాయలు, సాధారణ వరి ధాన్యానికి 2369 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం నిర్దేశించిందని, సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ ను ప్రభుత్వం ఇవ్వనుందని కలెక్టర్ తెలిపారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌనిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని టెంట్లు, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ధాన్యం 17% కంటే తక్కువ ఏమైనా రైతులకు టోకెన్లు ఇచ్చి ధాన్యాన్ని సేకరించాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు వరి ధాన్యానికి సరిపడా టార్పాలిన్లు, తూకం తేమ తూర్పార యంత్రాలు, గోనె సంచులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని తెలిపారు. దడ్డు సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రత్యేకంగా గుర్తించి లేచి ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. వరి ధాన్యాన్ని తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సమకూర్చుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసి సమస్యలను తీర్చాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, డి ఎం సి ఎస్ మొహం కృష్ణ, డి సి ఎస్ ఓ సుదర్శన్, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ శ్యామ్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి మహమ్మద్ రియాజ్, అదనపు డి ఆర్ డి ఓ నరసింహులు, డీపీఎం కొమరయ్య, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బాలేశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
