మైల్వార్ గ్రామస్తులకు శుభవార్త….! త్వరలో బిఎంఆర్ బేబీ కిట్ …!
బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామస్తులకు శుభవార్త…! బిఎంఆర్ బేబీ కిట్ పేరుతో ప్రసవించిన తల్లులకు అందించనున్నారు. బేబీ కిట్ లో పుట్టిన చిన్నారులకు అవసరమయ్యే బెడ్, డ్రెస్ లు, టవల్స్, వాషబుల్ నాప్ కిన్స్, దోమతెర, జాన్సన్ పౌడర్, షాంపూ లాంటి వాళ్ళు వస్తువులను బిఎంఆర్ కిట్ ద్వారా అందించనున్నారు. ఈ పథకం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అభిమానులు అందించనున్నారు. సంగిశెట్టి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బిఎంఆర్ కిట్టు అందించనున్నారు. గ్రామానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో, భవిష్యత్తులో చిన్నారులు ఆరోగ్యంగా ఉండే విధంగా కిట్ ను అందించనున్నారు. మైలవరం గ్రామ బాలింతలు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రులలో డెలివరీ అయిన అనంతరం అందించనున్నట్లు తెలిపారు.
