May 15, 2026

మున్సిపల్ సమావేశం కాదు….షటిల్ ఆట చూశా…బిజెపి ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం

IMG_20260416_154345280_HDR

తాండూర్ మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న తాను షటిల్ ఆట ఆడే క్రీడాకారులను చూశానని సమస్యలపై మాట్లాడవలసిన కౌన్సిలర్లు సమస్యలపై మాట్లాడకుండా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు… ప్రతిపక్ష బిఆర్ఎస్ కౌన్సిలర్లు వ్యక్తిగతంగా దూషించుకున్నారని వారిని చూడడమే తమవంతుగా షటిల్ ఆడుతున్న క్రీడాకారులను చూసినట్టు అనిపించిందని నాగారం మల్లేశం అన్నారు. నేడు జరిగిన మున్సిపల్ సమావేశంలో అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బంటు వేణుగోపాల్, ప్రతిపక్ష నాయకురాలు దీపా నర్సింలు మధ్య ఎవరు ఎక్కడ భూములు కబ్జా పెట్టారో అనే విషయాలను ఇరువురు వెల్లడించుకున్నారని అన్నారు. సమస్యలపై మాట్లాడవలసిన కౌన్సిలర్లు వ్యక్తిగతంగా దూషించుకోవడం, ఒకరికొకరు కబ్జాల చిట్టా విప్పుకున్నారని   నాగారం మల్లేశం తెలిపారు.  ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జోక్యం చేసుకొని వ్యక్తిగతంగా దూషించుకోరాదని సర్ది చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ కౌన్సిలర్ బంటు వేణు గోపాల్ మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆపవలసి ఉండేదని, సర్ది చెప్పవలసి ఉండేదని తాను మాట్లాడినప్పుడు మాత్రమే ఎమ్మెల్యే అడ్డుకున్నారని, తాను చెప్పేది కూడా ప్రతి ఒక్కరు వినాలని దీప నర్సింలు బీస్మించుకొని కూర్చొని బంటు వేణుగోపాల్ చేసిన కబ్జాలను సవివరంగా సభా దృష్టికి తీసుకు వెళ్లారని నాగారం మల్లేశం తెలిపారు. చివరికి ఎమ్మెల్యే జోక్యంతో 36 వార్డుల సమస్యలను చర్చించామని అంతకు ముందు మాత్రం కౌన్సిలర్లను కాదని షటిల్  క్రీడాకారులను చూశానని నాగారం మల్లేశం తెలిపారు.