ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను.. భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన స్వరూప మల్లేశం

– 27వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. ఎమ్మెల్యే సహకారంతో కోట్లాది నిధులు తెస్తా: కౌన్సిలర్ ఉప్పురి స్వరూప మల్లేశం
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నేత శ్రీనివాస్ రెడ్డి సహకారంతోనే ఈ విజయం: 27వ వార్డు కౌన్సిలర్ వెల్లడి
తాండూర్, ఫిబ్రవరి 13:
తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో తనపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించిన 27వ వార్డు ప్రజలకు ఆ వార్డు కౌన్సిలర్ ఉప్పురి స్వరూప మల్లేశం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం వార్డు ప్రజల విజమని, తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన విజయంలో కీలక పాత్ర పోషించిన స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, RBOL సీఈఓ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యనీ శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో కౌన్సిల్ ద్వారా కోట్లాది రూపాయల నిధులు సేకరించి, 27వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా స్వరూప మల్లేశం ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తానని ఆమె హామీ ఇచ్చారు.