August 1, 2026

ముగిసిన మున్సిపల్ ఎన్నికలు….. తాండూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ దే

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా తాండూరు పట్టణంలోని  36 వార్డుల ఫలితాలు వెలుపడ్డాయి.  శుక్రవారం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్ జూబ్లీ పాఠశాలలో నిర్వహించిన కౌంటింగ్ లో   అధికార  కాంగ్రెస్ పార్టీకి 19,   ప్రతిపక్ష  బిఆర్ఎస్  పార్టీకి 12,   బిజెపి పార్టీకి మూడు, ఏఐఎంఐఎం పార్టీ ఒక్క కౌన్సిలర్  సీటు,  ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. తాండూరు పట్టణంలోని 36 వార్డులలో  చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి మ్యాజిక్ ఫిగర్  18 సంఖ్యను కాంగ్రెస్ పార్టీ  19  కౌన్సిలర్ సీట్లలో గెలిచి  కైవసం చేసుకుంది.  మొదటి రౌండ్ నుండి ప్రతిపక్ష  బిఆర్ఎస్ పార్టీ  దోకుడు పెంచింది.  12 కౌన్సిలర్  ఫలితాల అనంతరం కాస్త బిఆర్ఎస్ తన జోరును తగ్గించింది.  మొత్తం 36 వార్డులలో  11వ వార్డు  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంటు వేణు గోపాల్ అత్యధిక మెజార్టీ సాధించారు.  వార్డు నెంబర్ 1 లో   బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధన సిరి నాగలక్ష్మి ప్రత్యర్థి పై 198 ఓట్ల మెజారిటీ సాధించింది.  వార్డ్ నెంబర్ 2  లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రత్యూష  ప్రత్యర్థి పై 204  ఓట్ల మెజారిటీసాధించారు. వార్డ్ నెంబర్ మూడులో తయబా సుల్తానా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  ప్రత్యర్థి పై 72 ఓట్ల మెజార్టీ సాధించింది.  వార్డ్ నెంబర్ నాలుగులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెహర్ ఉన్నిసా బేగం  ప్రత్యర్థి పై 36 ఓట్ల మెజారిటీ,  వార్డ్ నెంబర్ 5  లో స్వతంత్ర  అభ్యర్థి  జీనత్  బేగం ప్రత్యర్థి పై  92 మెజారిటీ,  వార్డ్ నెంబర్ ఆరు నుండి  బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ 98 ఓట్ల మెజారిటీ,   వార్డ్ నెంబర్  7 నుండి  బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇర్షాద్  ప్రత్యర్థి పై 441 మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 8 నుండి , బిఆర్ఎస్ అభ్యర్థి జావిద్ హుస్సేన్ 832  ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాయప్ప పై భారీ మెజార్టీ సాధించారు.  వార్డు నెంబర్ 9 లో  ఉత్కంఠ భరితంగా జరిగిన కౌంటింగ్లో  బిఆర్ఎస్ అభ్యర్థి పట్లోళ్ల దీప నర్సింలు  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైతన్య ప్రశాంతపై 45 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  బిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నరసింహులు  పై  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లాపూర్ శ్రీకాంత్  383  ఓట్ల భారీ మెజార్టీ సాధించారు. వార్డ్ నెంబర్ 11 లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంటు వేణుగోపాల్  ప్రత్యర్థి పై  అత్యధికంగా  909  ఓట్ల  మెజార్టీ సాధించారు. వార్డ్ నెంబర్ 12 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  పట్లోళ్ల నీరజబాల్ రెడ్డి  ప్రత్యర్థి  బిజెపి అభ్యర్థి రజనీకాంత్ పై 424  ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 13 లో  బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాజీ ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ అల్లుడు సురేష్ నాయక్  ప్రత్యర్థి పై 61 ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 14 లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహియా  అంజుమ్  ప్రత్యర్థి పై 72  ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 15లో  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మూడుసార్లు వరుసగా విజయం సాధించిన బొబ్బిలి శోభారాణిపై  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివిటి ఎల్లప్ప 23 ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 16 లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారా శ్రీలత 243 ఓట్ల మెజార్టీ సాధించారు. వార్డ్ నెంబర్ 17లో   కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సనాతభుసం  246  ఓట్ల మెజార్టీ సాధించగా,  వార్డ్ నెంబర్ 18లో  ఎంఐఎం పార్టీ అభ్యర్థి  మోయిస్  హైమద్ ఖాన్ 33  ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 19 లో బిజెపి పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిన జంటుపల్లి వెంకట్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రత్యర్థి పై 31 ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 20 లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన సంతోష్ గౌడ్ 97 ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 21 లో  తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  హబీబ్ లాల  సతీమణి  సభ ఫాతిమా ప్రత్యర్థి పై 369  ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 22లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  మనపురం రామకృష్ణ 210 ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 23లో  ప్రత్యర్థి గడ్డల పరిమళపై బీజేపీ అభ్యర్థి అంతారం కిరణ్ 291 ఓట్ల మెజార్టీ సాధించారు. వార్డ్ నెంబర్ 24 లో ప్రత్యర్థి సాహూ శ్రీలత పై  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  పోలీస్ బాలకృష్ణారెడ్డి 205  ఓట్ల మెజార్టీ సాధించారు వార్డ్ నెంబర్ 26లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  వైశాలి రాజు గౌడ్ ప్రత్యర్థి పై 363  ఓట్ల మెజార్టీ సాధించారు.   వార్డ్ నెంబర్ 27లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పరి మల్లేశం సతీమణి,మాజీ  పెద్దముల్  జెడ్పిటిసి స్వరూప 283  మెజార్టీ సాధించారు.   వార్డ్ నెంబర్ 28లో  బిజెపి తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ప్రత్యర్థి పై 119  ఓట్ల మెజార్టీ సాధించారు.   వార్డ్ నెంబర్ 29లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇదివరకు రెండుసార్లు కౌన్సిలర్గా చేసిన అబ్దుల్ రజాక్ మూడోసారి ప్రత్యర్థి  సుమిత్ గౌడ్ పై 468  ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 30లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహరాజ్ బేగం ప్రత్యర్థి పై 36 ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 31 లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యోగానంద్ ప్రత్యర్థి పై 239 ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నెంబర్ 32 లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉమామహేశ్వరి ప్రత్యర్థి 290 ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డ్ నంబర్ 33 లో బిజెపి అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ప్రత్యర్థి పై201  ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డు నంబర్ 34 లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటేల్ సుప్రీత 203  ఓట్ల మెజార్టీ సాధించారు.  వార్డు నంబర్ 35 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  అప్సమైన  ప్రత్యర్థి పై 39   ఓట్ల  మెజార్టీ సాధించారు.  వార్డు నెంబర్ 36 లో  టిఆర్ఎస్ అభ్యర్థి రూపా రుద్రు పటేల్   కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్వ సిరి చందన పై  350 ఓట్ల మెజార్టీ సాధించారు.