శివరాత్రి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక చర్యలు తీసుకోండి… మున్సిపల్ అధికారులను కోరిన బిజెపి నాయకులు
మహాశివరాత్రి సందర్భంగా మున్సిపల్ శాఖ తరపున తాండూరు పట్టణంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బిజెపి కౌన్సిలర్లు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. శనివారం తాండూర్ మున్సిపల్ కార్యాలయం దగ్గర బిజెపి తాండూరు పట్టణ అధ్యక్షులు నూతన కౌన్సిలర్ నాగారం మల్లేశం, కౌన్సిలర్లు అంతారం కిరణ్, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ హిందువులకు ఎంతో పవిత్రమైన మహా శివరాత్రి పండుగ సందర్భంగా తాండూరు పట్టణంలోని 36 వార్డులలో ఉన్న హిందూ దేవాలయాలు, శివాలయాల దగ్గర మున్సిపల్ శాఖ తరపున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పరిశుభ్రంగా ఉంచాలని, త్రాగునీటి వసతి కల్పించాలని, విద్యుత్ అంతరాయం జరగకుండా చూడాలని కోరారు.
