నవంద్గిలో ఉత్సాహంగా సాగిన కబడ్డీ పోటీలు
బషీరాబాద్, మహా శివరాత్రి సందర్భంగా తాండూర్ నియోజకవర్గం, బషీరాబాద్ మండల పరిధిలోని నవంద్గి గ్రామపంచాయతీలో శనివారం కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో గ్రామానికి చెందిన 1 నుండి 24 ఏళ్ల లోపు యువకులు, బాలలు ఉత్సాహంగా పాల్గొన్నారు. శివరాత్రి సంబరాల్లో భాగంగా క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలోని యువతకు ఆటల పట్ల ఉన్న ఆసక్తిని ఈ పోటీలు ప్రతిబింబించాయి. హోరాహోరీగా సాగిన ఈ కబడ్డీ మ్యాచ్‌లను చూసేందుకు గ్రామస్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలతో పాటు యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. విజేతలకు గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా ఐకమత్యానికి తోడ్పడతాయని ఈ సందర్భంగా పెద్దలు పేర్కొన్నారు. – (సంకల్పం బషీరాబాద్ మండలం ప్రతినిధి గోపాల్)
