September 19, 2026
FB_IMG_1770989447994

తాండూర్: తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన 19 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు RBOL సిఈఓ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుయ్యాన్ని శ్రీనివాస్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం పార్టీ కార్యకర్తల కృషికి, ప్రజలకు కాంగ్రెస్ పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో నూతనంగా ఎన్నికైన అభ్యర్థులు కీలక పాత్ర పోషించాలని, వార్డుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సేవలో అంకితభావంతో ఉంటూ తాండూర్ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ, విజేతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.