November 4, 2026

సంకిరెడ్డిపల్లి లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు

సంకిరెడ్డిపల్లి  గ్రామంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం తాండూరు మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటం ముందు కేక్ కట్ చేసి, గ్రామంలో స్వీట్లను  పంచి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.  ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 14 సంవత్సరాల సుదీర్ఘ రాష్ట్ర సాధన పోరాటంలో అలుపెలుగని ఉద్యమ వీరుడిగా, తెలంగాణ  జాతిపితగా పేరు గడిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంకిరెడ్డిపల్లి  గ్రామ మాజీ సర్పంచ్ అమృత్ రెడ్డి, ఉప సర్పంచ్ బక్కప, గ్రామపంచాయతీ సభ్యులు రసూల్, సలీంఖాన్, సయ్యద్  చందు,  అమీర్ ఖాన్,  ఆసిఫ్ ఖాన్,మోహనసింగ్, గోపాల్, శివరాం, శ్రీరాం, రాజు,  బద్రు, వినోద్ రాథోడ్, అశోక్, నర్సింలు, జగ్గప్ప, హమీద్ ఖాన్, లింగప్ప, ఇస్మాయిల్  తదితరులు పాల్గొన్నారు.