August 1, 2026

ఏఎస్ జిఎంకే ట్రస్ట్ సేవలు అభినందనీయం….. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

ఏఎస్ జిఎంకె ట్రస్ట్  సేవలో అభినందనీయమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని  ఏఎస్ జిఎంకే ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.  ఏఎస్ జిఎంకే ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి,  వైస్ చైర్మన్  అబ్దుల్ రజాక్,  మరియు కౌన్సిలర్లను  ఏఎస్ జిఎంకే ట్రస్ట్  అధినేత ముజీబ్ ఖాన్ ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ  ఏఎస్ జిఎంకే ట్రస్ట్ అధినేత  ముసిబ్ ఖాన్ ఎన్నో సేవా కార్యక్రమాలు  చేపట్టారని గుర్తు చేశారు.  ముఖ్యంగా విద్యార్థులకు  పుస్తకాలు, నోటు  బుక్స్,   బీద విద్యార్థులకు ఫీజులను కూడా చెల్లించారని,  మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు  కుట్టు మిషన్లు లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందజేశారని,  బీద మహిళలకు  మెహేంది డిజైన్ నేర్పించారని,  మరికొందరికి ఇళ్ల స్థలాలను కూడా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.  ఈ సందర్భంగా  ఏఎస్ జిఎంకే ట్రస్ట్  చైర్మన్ ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా తన సంపాదనలో 30% సేవలకు అందిస్తున్నానని తెలిపారు.  ముందు ముందు ప్రభుత్వం ద్వారా అందించే సేవలలో కూడా తమ ట్రస్ట్ భాగస్వామ్యం వహిస్తుందని అన్నారు.  తాండూరు పట్టణంలో బీఈడీ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేస్తామని  ముజీబ్ ఖాన్  తెలిపారు.  నూతనంగా పదవి చేపట్టిన తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజాబాల్ రెడ్డి,  వైస్ చైర్మన్  అబ్దుల్ రజాక్ కు కృతజ్ఞతలు తెలిపారు.  తాండూరును అభివృద్ధి పరచాలని అందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ముజీబ్ ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్,  ఏఎస్ జిఎంకే ట్రస్ట్  సభ్యులు,  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కరణం పురుషోత్తం రావు,  అబ్దుల్ రావుఫ్,  నయుం అత్తర్, అబ్దుల్ ఆహాద్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.