ఈనెల 19 గురువారం జరిగే శివాజీ శోభయాత్రను విజయవంతం చేద్దాం…. రజినీకాంత్
శివాజీ జయంతి సందర్భంగా ఈనెల 19 గురువారం తాండూరు పట్టణంలో జరిగే శోభాయాత్రను విజయవంతం చేద్దామని బిజెపి నాయకులు రజినీకాంత్ కోరారు. బుధవారం తాండూరు పట్టణంలోని నాగారం నర్సింలు కాంప్లెక్స్ లో బిజెపి తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తో పాటు కలిసి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకు తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయం నుండి వినాయక చక్, ఇందిరాచౌక్ మీదిగా శివాజీ చౌక్ వరకు శోభాయాత్ర ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్క హిందు బంధువు పాల్గొనాలని, తాండూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ప్రతి కాలనీ నుండి వాడల నుండి శోభాయాత్రలో పాల్గొనాలని రజినీకాంత్ సూచించారు. కుల మతాలకు అతీతంగా రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ప్రతి సంవత్సరం జరిగే శోభాయాత్ర కన్నా ఈ సంవత్సరం జరిగే శోభాయాత్రలో హిందువులు భారీ సంఖ్యలో పాల్గొని పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు.
