చిట్టెపు ప్రకాష్ రెడ్డి స్మారకార్థం ప్రజాప్రతినిధుల సన్మాన సభ
– ఈ నెల 22న ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
– పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులకు గౌరవం: రాఘవేందర్ రెడ్డి
– సీపిఆర్ జ్ఞాపకార్థం చిట్టెపు రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం
– ప్రజాప్రతినిధుల సేవలను గుర్తించడమే లక్ష్యం: చిట్టెపు రాఘవేందర్ రెడ్డి
– చిట్టెపు ప్రకాష్ రెడ్డి స్మారకార్థం ప్రజాప్రతినిధుల సన్మాన సభ
సంకల్పం ప్రతినిధి పెద్దేముల్: దివంగత చిట్టెపు ప్రకాష్ రెడ్డి (సీపిఆర్) స్మారకార్థం పెద్దేముల్ మండలానికి చెందిన తాజా, మాజీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించనున్నట్లు యువ నాయకుడు చిట్టెపు రాఘవేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం తన నివాసంలో పెద్దేముల్ సొసైటీ మాజీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 22వ తేదీ ఆదివారం నాడు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమాజం కోసం నిరంతరం శ్రమించే ప్రజాప్రతినిధుల సేవలను గుర్తించి, వారిని గౌరవించుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తాజా, మాజీ ప్రజాప్రతినిధులందరూ, ఆహ్వానితులు మరియు ప్రజలు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఇతర స్థానిక నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
