July 30, 2026

నీట్ పరీక్ష నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం — ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

IMG-20260512-WA0801

నీట్ పరీక్ష నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని  ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.  దేశవ్యాప్తంగా వైద్య విద్య కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్ష నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వరుసగా ప్రశ్నపత్రాల లీకేజీలతో, పారదర్శకత లోపించడం వల్ల విద్యార్థులు మరియు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని  మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును నిర్మించే యువత జీవితాలతో రాజకీయాలు చేయకుండా, కేంద్ర ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల నమ్మకాన్ని కాపాడాలంటే నీట్ పరీక్ష వ్యవస్థలో పూర్తి పారదర్శకత, భద్రత, జవాబుదారీతనం తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.అలాగే సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి.  నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని అన్నారు