మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో బాలుడు మృతి…. డాక్టర్ నిర్లక్ష్యమే … బాధితుల ఆరోపణ
తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో ఓ బాలుడు మృతి చెందాడు. తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న రహీం ఆదివారం తాండూరు పట్టణంలోని ఎం సి హెచ్ ఆసుపత్రిలో మూడు సంవత్సరాలు బాలుడు అభిబుకర్ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు తండ్రి రహీం ఆరోపించారు. బాలుడికి స్వల్ప అస్వస్థత… జ్వరం వచ్చినందున చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చినట్లు తండ్రి రహీం తెలిపారు. డ్యూటీలో ఉన్న డాక్టర్స్ మంజుల బాలుడిని పరిశీలించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు. బీద కుటుంబానికి చెందిన రహీం తమ కొడుకును తాండూరు పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించిన అనంతరం తిరిగి తాండూరు మాత శిశు సంరక్షణ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనంతరం బాలుడు మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్ తెలిపారు. దీంతో మృతి చెందిన బాలుడి కుటుంబీకులు ఎన్టీఆర్ కాలనీ వాసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు.
