పెద్దేముల్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
– పెద్దేముల్ మండల కేంద్రంలో కేసీఆర్ జన్మదినం సంబరాలు జరుపుకున్న బిఆర్ఎస్ నాయకులు
– తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు
– బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు, పంచాయతీ ఉప సర్పంచ్ డీవై ప్రసాద్
సంకల్పం ప్రతినిధి పెద్దేముల్: పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు, పంచాయతీ ఉప సర్పంచ్ డీవై ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా డీవై ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ చేసిన పోరాటాన్ని, ఆయన హయాంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిషన్ రావు, బిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి చాకలి రంగయ్య, గ్రామ కమిటీ కార్యదర్శి మామిండ్ల వెంకటయ్య, వార్డు సభ్యులు అంజి, మాజీ వార్డు సభ్యులు మంబాపురం యాదయ్య, కుమ్మరి విట్టల్, అజీమ్, పార్టీ నాయకులు శీను, కొండూరు మాణిక్యం, నర్సింలు, రాజు, ఎల్లప్ప, రామచంద్రి, సుందరి, యూసుఫ్, పూర్షప్ప, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
