July 31, 2026

రాష్ట్రస్థాయిలో జరిగే కరాటే క్రీడల్లో ఎంపికైన మాస్టర్ జపాన్ చోటే ఖాన్ నలుగురు క్రీడాకారులు

మాస్టర్ జపాన్ చోటే ఖాన్  కరాటే క్రీడాకారులు నలుగురు రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకు ఎంపికయ్యారు. మంగళవారం  వికారాబాద్  జిల్లా కేంద్రంలో  సీఎం కప్ 2026   క్రీడల్లో భాగంగా జిల్లాస్థాయిలో కరాటే క్రీడలు నిర్వహించారు.  అందులో భాగంగా మాస్టర్ జపాన్ చోటే ఖాన్   క్రీడాకారులు తమ సత్తా చాటారు.  ఏకంగా నలుగురు బంగారు పతకాలను సాధించి రాష్ట్రస్థాయిలో జరిగే కరాటే  క్రీడల్లో స్థానం పొందారు.  మాస్టర్ జపాన్ చోటే  క్రీడాకారులు అలియా బేగం,  రుక్సానా బేగం,సాయి ప్రకాష్, వేణు కరాటే లో బంగారు పతకాలను సాధించి రాష్ట్రస్థాయిలో జరిగే కరాటే క్రీడలకు ఎంపికయ్యారని సీనియర్  కరాటే మాస్టర్  బివి సాయికుమార్ తెలిపారు.  ఈ సందర్భంగా   మాస్టర్ జపాన్ చోటే ఖాన్ సీనియర్ మాస్టర్  సాయికుమార్ మాట్లాడుతూ  తాము కన్నా కళలను తమ క్రీడాకారులు నిజం చేస్తున్నందున సంతోషంగా ఉందని అన్నారు. ఎవరికైనా కరాటేల్లోఉచితంగా  శిక్షణ పొందాలని ఆసక్తి ఉంటే తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాల మైదానంలో  ప్రతిరోజు ఉదయం అక్కడ కలవాలని ఇతర వివరాలకు బివి సాయికుమార్ సెల్ నెంబర్ 9848743067, 9951772616 సంప్రదించాలని కోరారు.